O.D. Cheruvu: ఓ.డి. చెరువులో ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
O.D. Cheruvu: శ్రీ సత్య సాయి జిల్లా ఓ.డి. చెరువులో ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ నాయకుల నినాదాలు.
O.D. Cheruvu: ఓ.డి. చెరువులో ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఓ.డి. చెరువు: సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్య సాయి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఓ.డి. చెరువు మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోడౌన్ వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు రమణ మాట్లాడుతూ 1970 మే 30న స్థాపించబడిన సీఐటీయూ “ఐక్యత – పోరాటం” నినాదంతో దేశవ్యాప్తంగా కార్మికులను సంఘటితం చేస్తూ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.
కార్మికుల హక్కులను దెబ్బతీస్తూ, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా సీఐటీయూ ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపట్టిందన్నారు. అలాగే మతోన్మాద విధానాలను ఖండిస్తూ, కార్మికులు, ప్రజల ఐక్యతను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కష్టజీవుల శ్రమకు తగిన విలువ, గౌరవం లభించే సమసమాజ స్థాపనే సీఐటీయూ లక్ష్యమని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ యూనియన్ నాయకులు కుళ్లాయప్ప, కిష్టప్ప, నారాయణస్వామి, నాగరాజు, రవి, నాగముని తదితరులు పాల్గొన్నారు.




