Guntakal: గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన!

Guntakal: గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ నిరసన. కనీస వేతనాలు, అవుట్‌సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్, 12వ పిఆర్సి అమలుకు డిమాండ్.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 17 Aug 2026 2:20 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన!

Guntakal: 12వ పిఆర్సి వెంటనే అమలు చేయాలని నినాదాలు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మున్సిపల్ యూనియన్ CITU ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, 12వ పిఆర్సి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళనలు చేస్తామని CITU నేతలు హెచ్చరించారు.

నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story