Anantapur: బుక్కరాయసముద్రం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక శుభ్రత!
Anantapur: కార్తీక మాసం సందర్భంగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో పంచాయతీ శాఖ సహకారంతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
Anantapur: బుక్కరాయసముద్రం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక శుభ్రత!
Anantapur: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామంలోని ముసలమ్మ కట్ట వద్ద ఉన్న శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు.
కార్తీక మాసం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఆలయ ప్రధాన అర్చకులు అన్నమలై స్వామి ఆదేశాల మేరకు, పంచాయతీ శాఖ సహకారంతో ఈ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మణికంఠ, రమణ స్వామితో పాటు విలేకరి నారాయణస్వామి, కెమెరామెన్ జయరామ్ పాల్గొని శుభ్రత పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అన్నమలై స్వామి మాట్లాడుతూ ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు కూడా చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.




