Sri Sathya Sai: ఈనెల 24 వరకు ఓటు హక్కు సవరణకు అవకాశం కలెక్టర్!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును ఈనెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 14 July 2026 5:16 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: ఈనెల 24 వరకు ఓటు హక్కు సవరణకు అవకాశం కలెక్టర్!

శ్రీ సత్య సాయి: శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఈనెల 24 వరకు పొడిగించినట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందాయని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా అందిన ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. పొడిగింపబడిన తేదీని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా ప్రజలను కలెక్టర్ కోరారు.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL