Dharmavaram: పింఛన్ల దరఖాస్తులను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్!
Dharmavaram: ధర్మవరంలో నూతన పింఛన్ దరఖాస్తుల పరిశీలన, ఇ-కేవైసీ ప్రక్రియను శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Dharmavaram: పింఛన్ల దరఖాస్తులను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్!
Dharmavaram: ధర్మవరం పట్టణ పరిధిలోని 15వ వార్డు, గాంధీనగర్ సచివాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సచివాలయంలో నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి వేరిఫికేషన్, దరఖాస్తుల ప్రస్తుత స్థితి మరియు ఇ-కేవైసీ ప్రక్రియలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడూ విడిపోకుండా పక్కాగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.దరఖాస్తుల వేరిఫికేషన్ మరియు eKYC నమోదులో ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్దేశిత సమయానికే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు.సచివాలయ సిబ్బంది కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు అందుబాటులో ఉంటూ, ప్రక్రియపై సరైన అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి,ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య,స్థానిక సచివాలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.




