Puttaparthi: జిల్లావ్యాప్తంగా 1.76 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలు!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

SHAIKH FIROZ, PUTTAPARTHI
Updated on: 28 Jun 2026 4:22 PM IST
Puttaparthi
X

Puttaparthi: జిల్లావ్యాప్తంగా 1.76 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలు!

పుట్టపర్తి : రెండు పోలియో చుక్కలు - జీవితాంతం పిల్లలకు రక్షణగా నిలుస్తాయని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఎనుములపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కొంతమంది చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో రహితసమాజ నిర్మాణమే లక్ష్యమని ఇందుకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. పిల్లలకు వేయించే ఈ రెండు చుక్కలు వారిని పోలియో బారిన పడకుండా జీవితాంతం రక్షిస్తాయన్నారు.

భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర వైద్యారోగ్య శాఖలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ప్రాణాంతక వ్యాధి నుండి శాశ్వత రక్షణను అందించడానికి ప్రత్యేక పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పోలియోను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసే విధంగా కార్యక్రమం నిర్వహణకు ముందస్తు చర్యలు తీసుకొని సిబ్బందికి వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 1011 పోలింగ్ బూతులలో సుమారు 1,76,283మంది పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

అన్ని ప్రధాన కూడళ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్, స్థానిక ప్రాథమిక కేంద్రాలు అంగన్వాడీలు మరియు ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ, పట్టణ శివారు తదితర ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఉచితంగా పోలియో టీకాలు వేయడం జరుగుతున్నదన్నారు.

దాదాపు 200 దేశాలలో పోలియో పూర్తిగా నిర్మూలించబడిందని అయితే ఒకటి లేదా రెండు దేశాల్లో ఇప్పటికీ ఈ వైరస్ ఉండడం వల్ల ప్రపంచం మొత్తం పోలియో రహితంగా మారే వరకు నిరంతర అప్రమత్తత, టీకాల పంపిణీ అవసరమని అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలు అంగవైక ల్యాలకు గురికాకుండాకాపాడే విధంగా పల్స్ పోలియో బాధ్యతగా కార్యక్రమాలలో పాల్గొని విజయంతం చేయాలని కలెక్టర్ కోరారు.

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వారు విధి నిర్వహణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నోడెల్ అధికారి డాక్టర్. మనోజ్ కుమార్ డిఎం&హెచ్ఓ ఫైరోజ బేగం, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ,పుట్టపర్తి తహసీల్దార్ సంహిత,సిహెచ్ఐ వన్నప్ప,పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story