Puttaparthi: పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఘనంగా నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు.
Puttaparthi: పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి తహసిల్దార్ బి. కళ్యాణచక్రవర్తి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.ఎన్. నరసయ్య, జిల్లా పర్యాటక మేనేజర్ ప్రతాప్ రెడ్డి,ఇతర జిల్లా అధికారులు మరియు టీడీపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహానటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు NTR వివిధ వైవిధ్యభరితమైన వేషధారణలతో కూడిన చిత్రపటాల ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను సందర్శకులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు.




