Guntakal: గుంతకల్లులో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

Guntakal: గుంతకల్లు 4వ వార్డు ACS మిల్ ఏరియాలో శానిటేషన్, ఇంటింటి చెత్త సేకరణను కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. చెత్తను వేరుచేసి ఇవ్వాలని ప్రజలను కోరారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 23 July 2026 10:44 AM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

గుంతకల్లులో డోర్ టూ డోర్ చెత్త సేకరణ పరిశీలన - మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి

అనంతపురం జిల్లా: గుంతకల్లు పట్టణంలో పురపాలక సంఘం 4వ వార్డు ACS మిల్ ఏరియా*లో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి పర్యటించారు.

ఈ సందర్భంగా వార్డులో చేపడుతున్న శానిటేషన్ పనులు మరియు డోర్ టూ డోర్ చెత్త సేకరణ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, ప్రజలు కూడా చెత్తను వేరుచేసి ఇవ్వాలని సూచించారు. వీధులు శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story