Anantapur: పెట్రో భారంపై సిపిఐ సమరభేరి.. 9న ఏపీ వ్యాప్తంగా రాస్తారోకో!
Anantapur: పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్త రాస్తారోకోకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపు.
Anantapur: పెట్రో భారంపై సిపిఐ సమరభేరి.. 9న ఏపీ వ్యాప్తంగా రాస్తారోకో!
Anantapur: దేశవ్యాప్తంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారం అనంతపురం నగరంలోని ఎన్జీవో హోం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి అధ్యక్షతన పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఒక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి వామపక్ష పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ
కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ తీసుకుని, ధరలు తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పరిపాలన అంటూ ప్రజలపై 'డబుల్ భారం' మోపుతున్నారని,
కేవలం 15 రోజుల్లో నాలుగు సార్లు పెట్రో ధరలు పెంచి రవాణా రంగాన్ని, ఆర్టీసీని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జూన్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన ‘రాస్తారోకో’ (రహదారుల దిగ్బంధం) కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.




