Anantapur: తోటల్లో రైతుల కన్నీరు.. కూటమి సర్కార్‌పై సిపిఐ బాస్ గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్!
Anantapur: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాపినేపాల్యంలో ఎండిపోయిన చీని తోటలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య.
Anantapur: తోటల్లో రైతుల కన్నీరు.. కూటమి సర్కార్‌పై సిపిఐ బాస్ గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్!
Anantapur: సిపిఐ రైతు సంఘం అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలంలోని పాపినే పాల్యం గ్రామ పొలాల బోర్లు అడుగంటి పై ఎండిపోయిన చీని రైతు పొలాలను సిపిఐ రైతు సంఘం నాయకత్వం గ్రామ రైతులతో కలిసి పరిశీలించటం జరిగినది. ఈ పంట పరిశీలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ
అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం పండ్ల తోటలకు రక్షణగా నిధులు అందిస్తాం జిల్లాలో చీని టమోటా పండ్ల రశాల జ్యూస్ ఫ్యాక్టరీ లు ప్రారంభిస్తాం అని చెప్పడం తప్ప ఆచరణ మాత్రం ఫలితం శూన్యం ఈరోజు జిల్లాలో చీని రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పాపిని పాలెం గ్రామ రైతులని విచారిస్తే ఏ ఇంటి మహిళ ను కదిలించిన త్రాగడానికి చుక్క నీరు ఇంటికి లేదు చీని చెట్లకు అడుగంటిన బోర్లు బిక్కు బిక్కు మని చూస్తుంటే మాకు ఆత్మ హత్యలేని రైతులువాపోతుంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఒకసారి కూటం ప్రభుత్వం ఆలోచన చేయాలి చీని చెట్లకు సంబంధించి గత 7, 8 సంవత్సరాలుగా చంటి పాపను సాగినట్లు సాకి సంరక్షణ చేసి లక్ష రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు వేసి పంట సాగు చేస్తే కనుల ముందరనే ఎండిపోయి బీడు భూములుగా మారుతుంటే తోటల దగ్గరికి పోతే కంటి నుండి నెత్తురు చుక్కలు రాలుస్తుంటే ఇంత దారుణంగా ఉందా అనంతపురం జిల్లా అనేది అర్థమవుతుంది చంద్రబాబు ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితం క్షేత్ర స్థాయిలోరైతుల సమస్యలు గురించి పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు జిల్లాలో వేలాది ఎకరాలలో చీనీ పంట రైతుల పరిస్థితి ఆక్రందన అంతా ఇంత కాదు 500 వెయ్యి అడుగులు వేసిన నీటి చుక్క రాని పరిస్థితి ఒకపక్క మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్ మరో పక్క హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి జిల్లాలో అనుకున్న దాని కంటే సాగునీరు వచ్చింది త్రాగునీరు వచ్చిందని పేపర్ ప్రకటన తప్ప ఎక్కడ కూడా చెరువులు గాని కుంటలు గాని నింపిన పరిస్థితి లేదు.
అందువలన ఈరోజు గ్రామాల్లో త్రాగునీరు కూడా కటకట బోరుబావులు నీళ్లు ఇంకిపోయి చివరకు పశువులు దాహాన్ని తీర్చడానికి కూడా మండల కేంద్రానికి పోయి డబ్బులు పెట్టి మినరల్ వాటర్ తో పశువులు దాహాన్ని తీర్చడం అంటే గ్రామాల పరిస్థితి రైతులు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి కూటమీ ప్రభుత్వము క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేయాలి మరి ముఖ్యంగా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఉద్యాన శాఖ అధికారులను వ్యవసాయ శాఖ అధికారులను గ్రామస్థాయికి పంపించి కరువు అంచనాలను నివేదికల తయారుచేసి తక్షణమే నష్టపరిహారం అందించాలి రైతులు ఒక ట్యాంకర్ 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు పెట్టి చీని పంటకు రక్షిత తడులు అందిస్తున్నారు కాబట్టి ఉచితంగా ఆ మొత్తాన్ని చెల్లించి ప్రభుత్వమే ఉచితంగా రక్షికతడులు ట్యాంకర్ల ద్వారా అందించాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్యం నారాయణ స్వామి, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జె రాజారెడ్డి, సిపిఐ సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ రామకృష్ణ,జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, గార్లదిన్నె సిపిఐ మండల కార్యదర్శి ఎండి రాముడు, సింగనమల సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చేనేత మధు, మునుస్వామి, తిరుపతయ్య, శ్రీనివాసులు జగన్నాథం, అంజినప్ప, తాతయ్య, మరియు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.




