OD Cheruvu: పనులు పూర్తి కాకుండానే టోల్ వసూళ్లా.. సీపీఐ ఫిర్యాదు
OD Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మండలం ఇనగులూరు వద్ద రోడ్డు పనులు పూర్తి కాకుండానే టోల్ గేట్ నిర్వహించడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
OD Cheruvu: పనులు పూర్తి కాకుండానే టోల్ వసూళ్లా.. సీపీఐ ఫిర్యాదు
ఓ.డి.చెరువు: జాతీయ రహదారి పనులు పూర్తిగా కాకుండానే మండల పరిధిలోని ఇనగులూరు వద్ద టోల్గేట్ ఏర్పాటుచేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తాహసిల్దార్ శ్రీనివాసరెడ్డికి సిపిఐ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి చలపతి మాట్లాడుతూ.. కదిరి - గోరంట్ల రహదారి పనులు పూర్తి కాలేదని ఇప్పటికీ అక్కడక్కడ గుంతలు ఏర్పడి ప్యాచ్ వర్క్ మిగిలి ఉందన్నారు.
మండల కేంద్రంలో రహదారి పూర్తిగా దెబ్బతిన్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. హైవే పక్కన ఉన్న గ్రామాలకు అనుబంధంగా బారికేడ్లు ఏర్పాటు చేయలేదని దీంతో తరచూ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రోడ్ల మలుపు వద్ద తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదన్నారు.
రోడ్డు పనులు పూర్తికాకుండానే టోల్గేట్ నిర్వహిస్తుండడంపై కాంట్రాక్టర్ పై అభ్యంతరం తెలిపారు. రోడ్డు నిబంధన ప్రకారం పనులు పూర్తయిన తర్వాత టోల్గేట్ నిర్వహించాల్సి ఉండగా నిబంధనలకు వ్యతిరేకంగా టోల్ గేట్ నడుపుతుండడంపై తాసిల్దార్ కు ఫిర్యాదు చేశామన్నారు. పనులు పూర్తీ అయ్యేవరకు టోల్గేట్ నిర్వహణ ఆపివేయాలని లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.




