Anantapur: ఎంపీడీవో ఆఫీస్‌లో సీపీఐ ధర్నా నారాయణస్వామి మండిపాటు!

Anantapur: అనంతపురం జిల్లా దండవారిపల్లిలో నీటి కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ బుక్కరాయసముద్రం ఎంపీడీవో ఛాంబర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

T SIVASANKAR, ANANTAPUR
Published on: 11 Aug 2026 5:52 PM IST
Anantapur
X

Anantapur: ఎంపీడీవో ఆఫీస్‌లో సీపీఐ ధర్నా నారాయణస్వామి మండిపాటు!

Anantapur: బుక్కరాయసముద్రం మండల ఎంపీడీవో కార్యాలయంలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా.అధికారి చాంబర్‌లోనే ఆందోళనకు దిగిన సీపీఐ సింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి.

దండవారిపల్లి గ్రామంలో తీవ్ర నీటి కొరత ఉందని సీపీఐ ఆరోపణ,గత కొద్దిరోజులుగా నీటి సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం.నీటి ఎద్దడి తీరిందంటూ టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై నారాయణస్వామి మండిపాటు.

ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే.. సమస్య పరిష్కారమైందంటూ ప్రచారం చేయడమేంటని ప్రశ్న.గ్రామంలో వాస్తవ పరిస్థితులను అధికారులు పరిశీలించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్.

T SIVASANKAR, ANANTAPUR

T SIVASANKAR, ANANTAPUR