Anantapur: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం!
Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, తెలుగు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Anantapur: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం!
Anantapur: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో పాటు తెలుగుమహిళలు, బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ..
రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీక అని అన్నారు.మహిళల భద్రత, గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆయన రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.




