Anantapur: కదిరిలో నృసింహ జయంతి స్తోత్రాద్రికి పోటెత్తిన భక్తజనం
Anantapur: శ్రీ నృసింహ జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో భక్తులు పెద్దయెత్తున గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
Anantapur: కదిరిలో నృసింహ జయంతి స్తోత్రాద్రికి పోటెత్తిన భక్తజనం
అనంతపూర్: శ్రీ నృసింహ జయంతి సందర్భంగా కాటమ రాయుడుగా వెలసిన స్తోత్రాద్రికి పెద్దయెత్తున గిరిప్రదక్షిణ చేసిన భక్తులు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రికి ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున పెద్దయెత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు.నేడు శ్రీ నృసింహ స్వామి జయంతి కావడం వల్ల శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు శ్రీ వారికి అత్యంత ప్రీతిపాత్రమైన పానకం, వడపప్పు పంపిణీ చేశారు.శ్రీ వారు పాదం మోపిన స్తోత్రాద్రికి ఆలయ అర్చకులు ప్రత్యేక హారతులు ఇచ్చిన అనంతరం గోవింద నామస్మరణతో గిరిప్రదక్షిణను పూర్తి చేశారు.
శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం శ్రీ ఖాద్రీ వాకర్స్ అసోసియేషన్ వారి సహకారంతో కదిరి కొండ వద్ద మహా ప్రసాద వితరణ చేశారు.ఆలయ అధికారులు శ్రీ వారి ప్రసాదం , శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీరు , మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు అందించడం జరిగింది. స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం సాధ్యం అయినంత తొందరగా కదిరి కొండ చుట్టూ రహదారి మార్గాన్ని కూడా నిర్మిస్తామని కదిరి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సమితి సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది.శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తాదులకు ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున ప్రార్థిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు.




