Kadiri: కదిరిలో ఘనంగా శ్రీవారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో స్వాతి నక్షత్రం సందర్భంగా ఘనంగా శ్రీవారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ.. భక్తులకు అల్పాహారం, మజ్జిగ పంపిణీ.
Kadiri: కదిరిలో ఘనంగా శ్రీవారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మొదటగా పాదం మోపిన పర్వతం కావడం ఇక్కడ శ్రీ వారు కాటమ రాయుడుగా , శ్రీ కొండల లక్ష్మీ నారసింహుడుగా చెంచు లక్ష్మీ సమేతంగా కొలువై భక్తులు తలచినంతనే కోర్కెలు నెరవేర్చే దైవంగా వెలిశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రతి నెలా శ్రీ వారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వాతి నక్షత్రం రోజున అర్చకులు స్తోత్రాద్రికి ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం భక్తాదులు హరినామ కీర్తనలతో , గోవింద నామస్మరణతో పెద్దయెత్తున స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు.శ్రీవారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం కదిరి పట్టణ ప్రముఖులు పచ్చి పులుసు నరేంద్ర బాబు మరియు వారి సతీమణి పచ్చి పులుసు హరి కృప అలాగే వారి కుటుంబ సభ్యులు కదిరి కొండ వద్ద అల్పాహార వితరణ సదుపాయం కల్పించారు.
ఆలయ అధికారులు భక్తులకు శ్రీ వారి ఆలయం నుంచి ప్రసాదం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
స్థానిక శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ప్రభుత్వ అధికారులు , ప్రజా ప్రతినిధులు , శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు సాధ్యం అయినంత తొందరగా పూర్తి చేసి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు అందుబాటులోకి తీసుకొని రావాలని శ్రీవారి భక్తులు , శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు , హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు కోరుకుంటున్నారు.




