Anantapur: గురు పౌర్ణమి వేడుకలతో కోలాహలంగా మారిన అనంతపురం!

Anantapur: గురు పౌర్ణమి వేడుకలతో అనంతపురం కోలాహలంగా మారింది. సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తగా, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 29 July 2026 4:32 PM IST
Anantapur
X

Anantapur: గురు పౌర్ణమి వేడుకలతో కోలాహలంగా మారిన అనంతపురం!

గురు పౌర్ణమి వేడుకలతో కోలాహలంగా మారిన అనంతపురం!

గురు పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లాలోని షిర్డీ సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, దివ్యాంబరాలతో రకరకాల అలంకారాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు.

స్వామివారి నిజరూప దర్శనం మరియు సేవలను కళ్లారా తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఆలయాలన్నింటినీ విద్యుత్ కాంతులు, పుష్ప తోరణాలతో నయన మనోహరంగా అలంకరించారు.

ముఖ్యంగా అనంతపురం నగరంలోని మూడవ రోడ్డు, చెరువు కట్ట, వేణుగోపాల్ నగర్, వేమన భవనం సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయాలు భక్తుల నామస్మరణతో మారుమోగిపోయాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేలాదిమంది భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story