Dharmavaram: అంగన్వాడీ సిబ్బందికి శాలువాలతో సన్మానం
Dharmavaram: ధర్మవరంలో అంగన్వాడీల సేవలను గుర్తించి బీజేపీ నాయకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
Dharmavaram: అంగన్వాడీ సిబ్బందికి శాలువాలతో సన్మానం
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సత్యసాయి నగర్ లో ఉన్న 5 అంగన్వాడీ కేంద్రల సిబ్బంది అందరికీ వారు చేస్తున్న సేవలు గుర్తించి శాలువాల తో సత్కరించి కార 38వ వార్డు బీజేపీ ఇంచార్జ్ పట్టణ ఉపాధ్యక్షుడు గాండ్లపర్తి మల్లికార్జున గాండ్లపర్తి మీనాక్షి,ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ సతీష్ స్వామి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ అంబటి అరుణశ్రీ బీజేపీ పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర్ సాకే ఓబులేస్. ICDS CDPO లక్ష్మీ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణ అధ్యక్షులు జింక చంద్రశేఖర్ సాకే ఓబులేష్ బీరే విజయలక్ష్మి శారదమ్మ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పొరల మహాలక్ష్మి ST మోర్చా ఉపాధ్యక్షురాలు మంజుల భాయ్ గారు, మైనార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ నభిరసూల్ ఓబీసీ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి బండ్లపల్లి రాజు మైనార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మాలిక్ చరణ్ రాజు మధు , వరప్రసాద్ రెడ్డి ఈశ్వర్ నాయక్, జింక శేఖర్ రమణ, నాగ శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రధానమంత్రి మోదీ ఆశయాలకు అనుగుణంగా పోషణ్ అభియాన్ ద్వారా ప్రతి చిన్నారికి, గర్భిణీకి సంపూర్ణ పోషణ అందించడమే లక్ష్యమని, అంగన్వాడీల బలోపేతానికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది సేవలను అభినందించారు.




