Dharmavaram: ధర్మవరంలో బరితెగించిన దొంగలు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 6 May 2026 8:05 AM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో బరితెగించిన దొంగలు ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం మెషిన్ ను ఎత్తుకెళ్లిన దుండగులు ధర్మవరం పట్టణం పుట్టపర్తి రోడ్ లో ఉన్న IDFC బ్యాంకుకు సంబంధించి ఏటీఎం యంత్రాన్ని దొంగలు తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు.ఐడిఎఫ్సి బ్యాంకు కార్యాలయం కిందనే ఏటీఎం ను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున ఏటీఎంలో డబ్బులు చోరీ చేయడానికి ప్రయత్నించి డబ్బులు రాకపోవడంతో ఏకంగా ఎటిఎం మిషన్ ని ఎత్తుకెళ్లారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించగా ఏటీఎం మిషన్ను బొలెరో వాహనంలో పెట్టుకొని పరారయ్యారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు దుండగల కోసం గాలింపు చేపట్టారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM

Next Story