Dharmavaram: ఉచిత మట్టి వినాయకుల పంపిణీ..బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 22వ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పాల్గొన్న బీజేపీ నేతలు హరీష్ బాబు, ఓం ప్రకాష్ గౌడ్.

NAGENDRA, DHARMAVARAM
Published on: 13 Sept 2026 11:59 AM IST
Dharmavaram
X

Dharmavaram: ఉచిత మట్టి వినాయకుల పంపిణీ..బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన!

Dharmavaram: శ్రీ సత్యసాయి ధర్మవరం పట్టణం 22 వార్డు సాయినగర్లో ఆదివారం ఉదయం వార్డ్ బీజేపీ ఇంచార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగ పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ నాయకుడు హరీష్ బాబు హాజరై ప్రజలకు విగ్రహాలు పంపిణీ చేశారు.

రసాయన రంగులతో ఉన్న విగ్రహాల కంటే మట్టి విగ్రహాలు నిమజ్జనం చేస్తే పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని తెలిపారు.దాదాపు నూరు కుటుంబాలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించినట్లు ఓం ప్రకాష్ గౌడ్ తెలిపారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM