Dharmavaram: 22వ వార్డులో ఘనంగా 'జనతా వారధి' కార్యక్రమం
Dharmavaram: ధర్మవరంలో బీజేపీ ఆధ్వర్యంలో 'జనతా వారధి' నిర్వహించారు. ప్రజల సమస్యలపై అందిన అర్జీలను మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు హామీ ఇచ్చారు.
Dharmavaram: 22వ వార్డులో ఘనంగా 'జనతా వారధి' కార్యక్రమం
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు సాయి నగర్ లో నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో " జనతా వారధి"అనే కార్యక్రమం నిర్వహించారు.
వార్డు బీజేపీ ఇన్చార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మవరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కె హరీష్ బాబు, పట్టణ బీజేపీ అధ్యక్షులు జింక చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, మైనార్టీ నాయకులు రసూల్, నాయకులు రమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వార్డులో ఉన్న ప్రజలు పెన్షన్లు,ఇళ్ల పట్టాలు తదితర సమస్యలకు సంబంధించి అర్జీలు అందించారు. సుమారు 50 వరకు అర్జీలు వచ్చినట్లు వార్డు ఇన్చార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ తెలిపారు.అర్జీలను సాధ్యమైనంత త్వరగా మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింప చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.




