Dharmavaram: ధర్మవరంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ!

Dharmavaram: ధర్మవరంలో "ధన్వంతరి నాయి బ్రాహ్మణ సేవా సంఘం" నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా కడియాల నారాయణస్వామి. స్థానిక ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యంపై డిమాండ్.

NAGENDRA, DHARMAVARAM
Published on: 13 Oct 2026 2:17 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి సంబంధించి "ధన్వంతరి నాయి బ్రాహ్మణ సేవా సంఘం" నూతన కమిటీని నేడు ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మాల్యవంతం చలపతి,పట్టణ అధ్యక్షుడిగా కడియాల నారాయణస్వామి,ప్రధాన కార్యదర్శిగా నాగసముద్రం మారుతి ప్రసాద్ ఉపాధ్యక్షులుగా తాడిమర్రి ఆదినారాయణ,రాచేపల్లి కుల్లాయప్ప కోశాధికారిగా కొడవండ్లపల్లి జనార్ధన్ ఉప కోశాధికారి నాగేంద్ర ను ఎన్నుకున్నారు.

నూతన అధ్యక్షుడు కడియాల నారాయణస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనపై నమ్మకంతో పట్టణ నాయి బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాయి బ్రాహ్మణ సంఘంలో ఉన్న పెద్దల సలహాలు సూచనలతో నాయి బ్రాహ్మణ సంఘం సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు..

గౌరవ అధ్యక్షుడు చలపతి మాట్లాడుతూ ధర్మవరంలో నాయి బ్రాహ్మణుల జనాభా పదివేల వరకు ఉన్నారని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ తమకు సముచితమైన గౌరవం ఇవ్వలేదని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయి బ్రాహ్మణ కులస్తులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు సీనియర్ నాయకులతో పాటు పట్టణానికి చెందిన పలువురు నాయి బ్రాహ్మణ కులస్తులు హాజరయ్యారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM