Dharmavaram: ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్గా గుంజర శ్రీదేవి
Dharmavaram: ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధం; జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించిన గుంజర శ్రీదేవి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
Dharmavaram: ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్గా గుంజర శ్రీదేవి
ధర్మవరం: ధర్మవరం మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈనెల 23న నిర్వహిస్తున్నారు. చైర్మన్ గా ధర్మవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు పరిసే సుధాకర్ 20 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.. ఇక వైస్ చైర్మన్ ఎన్నిక ఎవరికి అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ 29 స్థానాలు వైఎస్ఆర్సిపి 7 బీజేపీ 7 జనసేన 4 స్థానాల్లో విజయం సాధించింది..
జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గుట్టకింద పల్లి తారకరామాపురం సంబంధించి 48 వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుంజర శ్రీదేవి( w/o గుంజర అశోక్ ) వైయస్సార్సీపి అభ్యర్థి పై జిల్లాలోనే అత్యధికంగా 1151 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన గుంజర శ్రీదేవికి ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న పట్టణంలో మహిళ సాధికారత అభివృద్ధి అంశాల్లో మరింత ప్రగతి సాధించాలంటే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన గుంజర శ్రీదేవికి ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇస్తే సమంజసంగా ఉంటుందని రాజకీయ వర్గాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది..
ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ పరిటాల శ్రీరామ్ గుంజర శ్రీదేవి వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం . 2019 తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన క్లిష్ట పరిస్థితుల్లో గుట్టకిందపల్లి తారక రామాపురం వార్డులో గుంజర అశోక్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలోపేతానికి తన వంతు కృషి చేయడాన్ని టీడీపీ అగ్ర నాయకత్వం సైతం గుర్తించి జిల్లాలో కౌన్సిలర్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన బీసీ మహిళ గుంజర శ్రీదేవికి ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిసింది.




