Dharmavaram: ధర్మవరంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో హరీష్ బాబు!

Dharmavaram: ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో బీజేపీ నేత కే.హరీష్ బాబు సమావేశం. మంత్రి సత్యకుమార్ యాదవ్ అభివృద్ధి సంక్షేమ ఫలాలపై చర్చ.

NAGENDRA, DHARMAVARAM
Published on: 13 Oct 2026 2:46 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో హరీష్ బాబు!

Dharmavaram: ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నేడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో బీజేపీ నేత కే.హరీష్ బాబు సమావేశమయ్యారు. వారితో ఆయన మాట్లాడుతూ ఒక పేద కుటుంబంలో పుట్టిన సత్యకుమార్ యాదవ్ ధర్మవరం ప్రజల ఆశీస్సులతో శాసన సభ్యుడిగా విజయం సాధించి వైద్య విద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా అయ్యాడని అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడన్నారు. 28 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ధర్మవరం నియోజకవర్గంలో చేపట్టామని తెలిపారు. రాబోయే రెండున్నర సంవత్సర కాలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన చేనేత మెగా క్లస్టర్ను ధర్మవరం కి తెచ్చామని, కోట్లాది రూపాయలతో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు త్వరలో చేపడతామన్నారు.. ఇప్పటివరకు 13 కోట్ల రూపాయలు సీఎం కింద వస్తే అందులో 6 కోట్లు వైయస్సార్సీపి కార్యకర్తలకే ఇచ్చామని హరీష్ బాబు వెల్లడించారు.

పార్టీలకతీతంగా ధర్మవరంలో చేసిన అభివృద్ధిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెట్టాలని సూచించారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM