Dharmavaram: న్యాయవాదిపై దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటు స్పందన!

Dharmavaram: "వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఉపేక్షించం".. లాయర్‌పై దాడిని తప్పుబడుతూనే హెచ్చరించిన మంత్రి సత్యకుమార్.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 23 May 2026 11:09 AM IST
Dharmavaram
X

Dharmavaram: న్యాయవాదిపై దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటు స్పందన!

Dharmavaram: ధర్మవరం మండలం పోతుకుంట పంచాయతీలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి రోడ్లపై చెత్తను తొలగించారు. మూడు రోజుల క్రితం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై మంత్రి సత్య కుమార్ అనుచరులు చేసిన దాడి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందించి ఘాటుగా సమాధానం ఇచ్చారు. దాడి ఘటనపై మంత్రి స్పందిస్తూ ఎవరైనా సరే హద్దుల్లో ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

హైకోర్టు న్యాయవాదిపై దాడి మీద స్పందించిన మంత్రి సత్యకుమార్ పాలనపరంగా ఏవైనా విమర్శలు చేస్తే సహిస్తాం కానీ కుటుంబ, వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఉపేక్షించం ఆయన ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మా వాళ్ల వ్యక్తిగతంగా ఎందుకు కామెంట్ చేశావని ప్రశ్నించారు. దానికి ఆయన కులం పేరుతో దూషించారు.. అందుకే దాడి చేశారు హైకోర్టు న్యాయవాది చేసింది తప్పే.. మా వాళ్లు దాడి చేయడం తప్పే కూటమి చేస్తున్న అభివృద్ధిని, ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారు గతంలో మధుసూదరన్ రెడ్డిని నెక్స్ట్ బర్త్ డే ఉండదని హెచ్చరించారు ఇలాంటి వాటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM