Dharmavaram: ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై తీరని సస్పెన్స్!
Dharmavaram: ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ సీటుపై కూటమిలో సస్పెన్స్. 48కి పెరిగిన వార్డులు, కేతిరెడ్డి కేడర్ రీఎంట్రీతో వైకాపా పుంజుకోవడంతో ఉత్కంఠ.
Dharmavaram: ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై తీరని సస్పెన్స్!
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మున్సిపల్ చైర్మన్ ఎవరన్న దానిపై కూటమిలో సస్పెన్స్ కొనసాగుతోంది.ధర్మవరం నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.టీడీపీ నుండీ పరిటాల శ్రీరామ్ జనసేన నుండి చిలకం మధుసూదన్ రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం వార్డులను 40 నుండీ 48 కి పెంచుతున్నట్టు కమిషనర్ తెలిపారు.2021 మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 40 వార్డులో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
2024 సాధారణ ఎన్నికల్లో ఓటమి అనంతరం సంవత్సరం వరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పెద్దగా ప్రజల్లోకి రాలేదు.కానీ ఇప్పుడు కేతిరెడ్డి ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ క్యాడర్లో జోష్ పెంచారు. ముఖ్యంగా ఇటీవల మెగా డీఎస్సీ లో అవకతవకలు,నేతన్న నేస్తం వంటి కార్యక్రమాల్లో భారీగా వైకాపా క్యాడర్ పాల్గొన్నారు.
కానీ కూటమిలో అటు పరిటాల శ్రీరామ్ మంత్రి సత్య కుమార్ మధ్య దూరం పెరగడంతో చైర్మన్ సీటు కూటమి పార్టీలో ఎవరికి కేటాయిస్తారో అన్నదానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది.ఓ వైపు బీజేపీ నాయకులు మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున తమకే చైర్మన్ సీటు దక్కాలని అంటుండగా బూతు స్థాయి నుంచి బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకే ధర్మవరం మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయించడం న్యాయం అంటూ టీడీపీ నాయకులు అంటున్నారు.
ఈ రెండు పార్టీలకు కాకుండా మద్యే మార్గంగా జనసేన పార్టీకి చైర్మన్ సీటు ఇస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ధర్మవరం పట్టణంలో ఇటీవల జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో వైకాపా బలం పుంజుకుంది.uముఖ్యంగా గత వైకాపా హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు వారికి ప్లస్ కాగా చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో నేతన్న సేవ పథకం అమలులో జరిగిన అవకతవకలు కూటమికి మైనస్ కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
వార్డుల సంఖ్య 48 కి పెరిగిన కూడా వైకాపాకు మాజీ కౌన్సిలర్లు చాలామంది పోటీలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు.కానీ కూటమిలో చాలావరకు సీట్ల పంపకాలపై ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. నోటిఫికేషన్ తేదీ దగ్గర పడుతుండడంతో కూటమి పార్టీ నాయకుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొంది.




