Dharmavaram: ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: పరిటాల శ్రీరామ్!

Dharmavaram: ధర్మవరంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాలను పరిటాల శ్రీరామ్ పంపిణీ చేశారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 13 Sept 2026 4:54 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ: పరిటాల శ్రీరామ్!

ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి విగ్రహాలను టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అందజేశారు.

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలను పూజించాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు.పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్యవైశ్య యువజన సంఘానికి ఆయన అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాటమయ్య, క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి,పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్,పురుషోత్తం గౌడ్ రాళ్లపల్లి షరీఫ్,ఫణి కుమార్, రాంపురం శీనా లెజెండ్ నారాయణస్వామి మరియు మహిళ నాయకులు ముత్తుకూరు బీబీ తదితరులు పాల్గొన్నారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM