Sri Sathya Sai: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.. ధర్మవరంలో రాస్తారోకో!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో త్రాగునీటి కోసం మహిళల ధర్నా.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 26 April 2026 9:57 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.. ధర్మవరంలో రాస్తారోకో!

శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో త్రాగునీటి కోసం ప్రజలు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని 26 వ వార్డ్ లక్ష్మీ చెన్నకేశవ పురంలో పది రోజులుగా మున్సిపాలిటీకి మంచినీరు సరఫరా చేయకపోవడంతో వార్డు ప్రజలు ఖాళీ బిందెలతో ధర్మవరం పుట్టపర్తి రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రస్తుత వేసవి కాలంలో మంచినీరు రాకపోవడంతో ప్రతిరోజు డబ్బులు వెచ్చించి నీళ్లు కొంటున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, ఏఈ దృష్టికి తీసుకెళ్లిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇంటి పన్నులు మున్సిపల్ కుళాయి పన్నులు వసూలు చేయడానికి ఉత్సాహం చూపే అధికారులు మంచినీటిని అందించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారని వార్డు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి నాయకులు ప్రజా సమస్యలపై కాకుండా సొంత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతో అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ధర్మవరంలో చర్చించుకుంటున్నారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM