Dhone: డోన్‌లో నకిలీ నంబర్ ప్లేట్ ప్రైవేట్ బస్సు సీజ్
Dhone: నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో భారీ మోసం వెలుగుచూసింది.
Dhone: డోన్‌లో నకిలీ నంబర్ ప్లేట్ ప్రైవేట్ బస్సు సీజ్
Dhone: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రవాణా శాఖ అధికారులు నిర్వహించిన సాధారణ తనిఖీలలో వెంకట సాయి ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో భారీ అక్రమం బయటపడింది. బస్సుపై అసలు నంబర్ ప్లేట్‌కు బదులుగా AR06C5533 నంబర్‌తో స్టిక్కర్ అతికించి ఉన్నట్లు గుర్తించారు. అనుమానం రావడంతో వాహన పత్రాలు, ఛాసీ నంబర్‌ను పరిశీలించగా బస్సు అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP39TT4607గా తేలింది. అనంతరం వివరాలు పరిశీలించగా ఈ బస్సుపై కడప జిల్లాలో రూ.4,14,250 జరిమానా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జరిమానాలు చెల్లించకుండా నంబర్ మార్చి అక్రమంగా నడుపుతున్నందుకు మోటారు వాహన చట్టం ప్రకారం రూ.5,77,040 జరిమానా విధించి, బస్సును స్వాధీనం చేసుకుని డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు.
Next Story




