Anantapur: బసినేపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి-1 అంగన్‌వాడీ కేంద్రాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సందర్శించి, సేవలతీరును పరిశీలించారు.
Anantapur: బసినేపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గుత్తి మండలం బసినేపల్లి-1 అంగన్‌వాడీ కేంద్రాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో అందిస్తున్న సేవలు, చిన్నారులకు కల్పిస్తున్న పోషకాహారం, పిల్లల హాజరు, కేంద్రం నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సంక్షేమ సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గుత్తి సీడీపీవో (CDPO), ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి గుత్తి సీడీపీవో కృతజ్ఞతలు తెలిపారు.




