Sri Sathya Sai: పుట్టపర్తి కలెక్టరేట్‌లో విద్యార్థుల అభినందన వేడుక
Sri Sathya Sai: పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన బాల సదనాల విద్యార్థులను కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అభినందించారు.
Sri Sathya Sai: పుట్టపర్తి కలెక్టరేట్‌లో విద్యార్థుల అభినందన వేడుక
శ్రీసత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్ లో కష్టాల్లో ఉన్నా పట్టుదలతో చదివి విజయం సాధించిన ఈ పిల్లలు అందరికీ ఆదర్శం - జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్. కలెక్టరేట్ లోని PGRS హాల్ నందు ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలలో విశేష ప్రతిభ కనబరిచిన బాల సదనాల విద్యార్థులను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ప్రత్యేకంగా అభినందించారు.ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల వసతి గృహాల్లో (JJ Act 2015 కింద) ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు కలెక్టర్ గారు బహుమతులు అందజేసి, వారిని సత్కరించారు.పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తున్న శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ (హిందూపురం), హ్యాపీ హోం ట్రస్ట్ (పుట్టపర్తి), RDT మరియు RGT సంస్థల నిర్వాహకులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ప్రమీల, జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPO) మహేష్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు మురళీధర్, నాగలక్ష్మి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




