Anantapur: మెరుపు దాడులు.. నాలుగు నకిలీ థెరపీ కేంద్రాలు సీజ్!

Anantapur: అనంతపురం నగరంలో అనుమతులు లేకుండా నడుస్తున్న 4 థెరపీ క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 4 July 2026 11:07 AM IST
Anantapur
X

Anantapur: మెరుపు దాడులు.. నాలుగు నకిలీ థెరపీ కేంద్రాలు సీజ్!

అనంతపురం: నగరంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నాలుగు చికిత్స కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి మందులు వాడకుండా, కేవలం 'థెరపీ'ల ద్వారా దీర్ఘకాలిక రోగాలు మరియు మోకాళ్ల నొప్పులను పూర్తిగా నయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో (Social Media) మోసపూరిత ప్రచారాలు చేస్తున్న కేంద్రాలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక' ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు స్పందించారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) ఈబీ దేవి ఆధ్వర్యంలో నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.తగిన అనుమతులు, పత్రాలు లేవని నిర్ధారించుకున్నాక కింది 4 కేంద్రాలను అధికారులు సీజ్ చేశారు.

కైరో ప్రాక్టీస్ సెంటర్,ప్యూర్ కైరో సెంటర్,ట్రస్ట్ ఫిజియోథెరపీ సెంటర్,పెయిన్ ఫ్రీ లైఫ్ విత్ మై హెల్త్ కేర్ సీజ్ చేశారు.

జిల్లాలో ఎవరైనా సరే తగిన అనుమతులు లేకుండా చికిత్సలు అందించినా లేదా ఆసుపత్రులు నిర్వహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డా. ఈబీ దేవి, DMHO

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story