Rayadurgam: రాయదుర్గం జీవో 396కు వ్యతిరేకంగా రైటర్ల నిరసన
Rayadurgam: రాయదుర్గంలో జీవో 396ని రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల నిరసన. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రెండో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు.
Rayadurgam: రాయదుర్గం జీవో 396కు వ్యతిరేకంగా రైటర్ల నిరసన
రాయదుర్గం: రాయదుర్గంలో దస్తావేజు లేఖరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్లు సమరశంఖం పూరించారు. జీవో నెంబర్ 396 ను తక్షణమే రద్దు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఉధృతమైన నిరసనలు చేపట్టారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ల రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. జీవో నెంబర్ 396 కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖరుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా పూర్తి స్థాయిలో పెన్ డౌన్ నిర్వహించిన రైటర్లు, నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (PPP - ప్రజా ప్రైవేట్ భాగస్వామ్యం) విధానం ద్వారా దస్తావేజు లేఖరుల వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూడటం సరికాదన్నారు.




