Lakkireddypalli: నూతన దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

Lakkireddypalli: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పాతమేదరపల్లికి చెందిన నిఖిల్ కుమార్, నాగ జ్యోతిల వివాహం PGR కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Aug 2026 11:19 PM IST
Lakkireddypalli
X

Lakkireddypalli: నూతన దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

లక్కిరెడ్డిపల్లి: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పాతమేదరపల్లి గ్రామానికి చెందిన బండి శివభద్రమ్మ, బండి నాగేశ్వరరావు దంపతుల పెద్ద కుమారుడు బండి నిఖిల్ కుమార్ వివాహం బండి నాగ జ్యోతితో బుధవారం ఘనంగా జరిగింది.

లక్కిరెడ్డిపల్లి రామాపురం రోడ్డులోని PGR కళ్యాణ మండపంలో నిర్వహించిన వివాహ వేడుకకు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story