Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ చంద్రశేఖర్!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ ఎం. చంద్రశేఖర్.
Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ చంద్రశేఖర్!
Tadipatri: ఈరోజు ఉదయం తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని జిల్లా SP జగదీష్ ఆదేశాల మేరకు తనిఖీ చేసిన డీఎస్పీ ఎం. చంద్రశేఖర్, రూరల్ యు.పి.ఎస్ సీఐ నారాయణరెడ్డి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్నికల విధుల నిర్వహణ, పంపిణీ కేంద్రం వద్ద భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, విధుల కేటాయింపుల ప్రకారం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.




