Anantapur: డంపింగ్ యార్డ్‌లో పట్టాభి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనిఖీ!

Anantapur: అనంతపురం డంపింగ్ యార్డ్‌ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 21 July 2026 7:10 PM IST
Anantapur
X

Anantapur: డంపింగ్ యార్డ్‌లో పట్టాభి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనిఖీ!

అనంతపూర్: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం అధికారులతో కలిసి అనంతపురం డంపింగ్ యార్డ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్త ప్రాసెసింగ్ పనుల్లో ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాంట్రాక్టర్లు, అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.డంపింగ్ యార్డ్‌లోని మొత్తం 3.78 లక్షల టన్నుల చెత్తలో ఇప్పటికే 2.41 లక్షల టన్నులను తొలగించినట్లు చైర్మన్ తెలిపారు. అక్టోబర్ 2 నాటికి యార్డ్‌లో చెత్త లేకుండా పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశించారు.

నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. రూ. 17.5 కోట్లతో రోజుకు 170 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసే నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.ఆగస్టు 15 నాటికి ప్లాంట్ కోసం స్థలాన్ని సిద్ధం చేస్తారు.

అక్టోబర్ 2 నుండి ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయి.పనులను వేగవంతం చేసేందుకు ఇకపై ప్రతి వారం టార్గెట్లు నిర్దేశించి, రోజుకు 4,000 టన్నుల చెత్తను క్లియర్ చేసేలా ప్రత్యేక యంత్రాలను తీసుకొచ్చారు.గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్నులు వేసి లక్షల టన్నుల చెత్తను పేరుకుపోయేలా చేసిందని, పాత పనుల పేరుతో గత వైసీపీ ఎమ్మెల్యే కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేస్తోందని స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story