Pamidi: పామిడిలో ఈగల్ పోలీసుల భారీ అవగాహన ర్యాలీ!

Pamidi: అనంతపురం జిల్లా పామిడిలో ఈగల్ ఎస్ఐ హనుమంతు ఆధ్వర్యంలో 'డ్రగ్స్ వద్దు... చదువు ముద్దు' నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 5 Aug 2026 11:44 AM IST
Pamidi
X

Pamidi: పామిడిలో ఈగల్ పోలీసుల భారీ అవగాహన ర్యాలీ

పామిడి: అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఈగల్ ఎస్ఐ బి. హనుమంతు ఆధ్వర్యంలో పామిడి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

'డ్రగ్స్ వద్దు... చదువు ముద్దు' అనే నినాదాలతో టీసీ ప్రభుత్వ పాఠశాల నుంచి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫ్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ హనుమంతు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణ, మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు.

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. తమ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా డ్రగ్స్ విక్రయించడం లేదా సేవించడం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story