Anantapur: యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం: మంత్రి సత్యకుమార్

Anantapur: అనంతపురం మేయర్ కూటమి అభ్యర్థి అజేష్ బాబు యాదవ్‌ను గెలిపించి యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 22 Oct 2026 5:02 PM IST
Anantapur
X

Anantapur: యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం: మంత్రి సత్యకుమార్

అనంతపురం: అనంతపురం మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజేష్ బాబు యాదవ్‌కు మద్దతుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అజేష్ బాబు యాదవ్‌ను ఆశీర్వదించి, విజయవంతం చేయాలని యాదవ సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు.సర్వం జగత్ శ్రీకృష్ణమయం అని పేర్కొన్న మంత్రి.. మనమంతా శ్రీకృష్ణుడి వంశీకులమని అన్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అందరికీ ఆదర్శమని, అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నించారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో బీజేపీకి రెండు సీట్లు లభించగా.. అందులో అనంతపురానికి అవకాశం దక్కిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌తో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని అన్నారు.కూటమి అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి మధ్య ఉన్న తేడాను ప్రజలు ఆలోచించాలని మంత్రి సూచించారు. కూటమి అభ్యర్థి మేయర్‌గా ఎన్నికైతే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

నగరంలో దీర్ఘకాలంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యతో పాటు చెరువుల సుందరీకరణ, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి కల్పించారని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి బీజేపీ అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు.

అనంతపురం మేయర్ అభ్యర్థి అజేష్ బాబు యాదవ్‌కు అవకాశం కల్పిస్తే నగర అభివృద్ధికి కృషి చేస్తారని, మనందరి గౌరవాన్ని కాపాడుతారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.అజేష్ బాబు యాదవ్‌ను గెలిపించుకోవడం ద్వారా యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.బ్యాలెట్ పేపర్‌లో మొదటి స్థానంలో ఉన్న కమలం గుర్తుకు ఓటు వేసి, బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM