Kadiri: కదిరిలో సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: ఓబులు

Kadiri: కదిరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని, స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలని సీపీఎం నేత జి. ఓబులు డిమాండ్ చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 25 Oct 2026 10:12 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: ఓబులు

సత్యసాయి జిల్లా: కదిరి స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర నాయకులు జి. ఓబులు డిమాండ్ చేశారు.

ఆదివారం కదిరి సిపిఎం పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జి. ఓబులు మాట్లాడుతూ రాష్ట్రంలోని స్థానిక సంస్థలు నిధుల కొరతతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఉన్న కొద్దిపాటి ఆర్థిక వనరులను, అధికారాలను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరించివేస్తున్నాయని విమర్శించారు.

స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలను పూర్తిస్థాయిలో బదిలీ చేయాలని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని, స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సిపిఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోందని జి. ఓబులు తెలిపారు.*

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కూటమిని ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు జి.ఎల్. నరసింహులు, జగన్మోహన్, నాయకులు ముస్తాక్, రామ్మోహన్, సాంబ, బాబ్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI