Dharmavaram: ప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి: జూటూరు వెంకటేష్
Dharmavaram: ధర్మవరం మున్సిపాలిటీ 18వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జనసేన అభ్యర్థి జూటూరు వెంకటేష్ కోరారు.
Dharmavaram: ప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి: జూటూరు వెంకటేష్
Dharmavaram: ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జూటూరు వెంకటేష్ (ఎంవీవీ వెంకీ) హామీ ఇచ్చారు. ఈరోజు ఆర్యవైశ్య కొత్త సత్రంలో బలిజ సంఘం నాయకులు సభ్యులు జూటూరు వెంకటేష్ కు తమ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా జూటూరు వెంకటేష్ మాట్లాడుతూ వార్డులో అన్ని కులాలు, మతాలకు వర్గాలకు సంబంధించి ప్రజలందరూ తనకు మద్దతుగా నిలిచినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
స్థానికుడైన నేను వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు 18వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా 18వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.. ప్రజాసేవే లక్ష్యంగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు వెంకటేష్ తెలిపారు.
తన తండ్రి జూటూరు రమణయ్య ధర్మవరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ గత 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు.పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, కరోనా సమయంలో వరుసగా 45 రోజులపాటు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు.
తన తండ్రి సేవా స్ఫూర్తితో తాను కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. స్నేహితుల సహకారంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు, కరోనా సమయంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. 18వ వార్డు ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే, వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెంకటేష్ హామీ ఇచ్చారు.




