Gooty: టీడీపీ నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏరాసు ప్రతాపరెడ్డి చర్చలు!

Gooty: అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ నేతలతో సమావేశమైన స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు ఏరాసు ప్రతాపరెడ్డి.. ఎన్నికల వ్యూహాలపై చర్చ.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 15 Sept 2026 7:45 PM IST
Gooty
X

Gooty: టీడీపీ నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏరాసు ప్రతాపరెడ్డి చర్చలు!

Gooty: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డిని గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న బ్లూ మూన్ హోటల్ వద్ద ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఏరాసు ప్రతాపరెడ్డితో నాయకులు చర్చించారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ బలోపేతం, స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమాలోచనలు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, పామిడి మాజీ 7వ వార్డు కౌన్సిలర్ వై.యు. రామాంజనేయులు, మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు జింకల రామకృష్ణ, ఎంపీటీసీ దివాకర్ సూరి, యుగంధర్, దూదు గుత్తి అనంతపురం రామయ్య తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL