Penukonda: రప రప నరుక్కునే కల్చర్ వైసీపీది: మంత్రి సవిత ఫైర్

Penukonda: రప రప నరుక్కునే ఫ్యాక్షన్ కల్చర్ వైసీపీదేనని మంత్రి ఎస్. సవిత మండిపడ్డారు. పెనుకొండలో పింఛన్లు పంపిణీ చేసి, రూ.25 లక్షల సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 1 Oct 2026 7:03 PM IST
Penukonda
X

Penukonda: రప రప నరుక్కునే కల్చర్ వైసీపీది: మంత్రి సవిత ఫైర్

పెనుకొండ: రప రప నరుక్కునే కల్చర్ , కుట్రలు, రెచ్చగొట్టే రాజకీయాలు చేసేది వైసిపిదని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టే రాజకీయాలను ప్రోత్సహించే పార్టీ కాదని, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

పెనుకొండ మున్సిపాలిటీలోని 21వ వార్డులో మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సవిత భూమిపూజ చేశారు.

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు మున్సిపాలిటీలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నియోజకవర్గంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

గోరంట్లలో జరిగిన ఘటనపై మంత్రి స్పందిస్తూ, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని ఆరోపించారు. వాటాల విషయంలో తలెత్తిన వివాదాలకు రాజకీయ రంగు పులిమి టీడీపీపై నిందలు వేయడం సరికాదన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం మానుకోవాలని సూచించారు.కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందని, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని మంత్రి తెలిపారు.

రహదారులు, డ్రైనేజీ, మౌలిక వసతులతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు.రెచ్చగొట్టే రాజకీయాలు టీడీపీ నైజం కాదు. అభివృద్ధి, సంక్షేమమే మా ధ్యేయం. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం”అని మంత్రి సవిత స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA