Pamidi: ఆస్తి వివాదంలో భర్తపై భార్య, కుమారుడి విచక్షణారహిత దాడి!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లిలో కుటుంబ కలహాలు. భార్య, కుమారుడి దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంతరెడ్డి పరిస్థితి విషమం. పోలీసుల దర్యాప్తు.
Pamidi: ఆస్తి వివాదంలో భర్తపై భార్య, కుమారుడి విచక్షణారహిత దాడి!
Pamidi: పామిడి మండలం గజరాంపల్లి గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి, తండ్రి సూర్యనారాయణ రెడ్డి, భార్యతో గొడవపడి కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు, కొడుకు అంజన్ రెడ్డి మధ్య తరచూ వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతని భార్య నాగలక్ష్మి, కొడుకు అంజన్ రెడ్డి సరస్వతి విద్యా మందిరం సమీపంలో నివాసం ఉంటున్నారు.
ఈరోజు ఆస్తి పంపకాల విషయంలో హనుమంతరెడ్డి, అతని భార్య, కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో భార్య, కొడుకు ఇద్దరూ కలిసి రాడ్లు, కర్రలతో హనుమంతరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని సమాచారం. తీవ్ర రక్తగాయాలతో ఉన్న హనుమంతరెడ్డి తన స్వగ్రామం గజరాంపల్లికి వెళ్తున్న క్రమంలో పొగరూరు గ్రామం NH-44 బ్రిడ్జ్ సమీపంలో స్పృహతప్పి పడిపోయాడు.
దీనిని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రోడ్డు ప్రమాదమా లేక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దాడి ఫలితమా అనే కోణంలో పామిడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




