OD Cheruvu: ఫార్మ్ పాండ్స్, వీడ్ మ్యాట్‌తో ఉద్యాన పంటల సంరక్షణ

OD Cheruvu: ఫార్మ్ పాండ్స్, వీడ్ మ్యాట్‌ వినియోగంతో నీటి పొదుపు, సాగు వ్యయం నియంత్రణ సాధ్యమని ఓ.డి. చెరువు ఉద్యాన అధికారి లావణ్య తెలిపారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 11 Sept 2026 3:03 PM IST
OD Cheruvu
X

OD Cheruvu: ఫార్మ్ పాండ్స్, వీడ్ మ్యాట్‌తో ఉద్యాన పంటల సంరక్షణ

శ్రీ సత్యసాయి జిల్లా, ఓ.డి. చెరువు: ఉద్యాన పంటల్లో నీటి కొరతను అధిగమించి, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు ఫార్మ్ పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్, వీడ్ మ్యాట్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల ఉద్యానశాఖ అధికారి లావణ్య సూచించారు. ఫార్మ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలకు అందించవచ్చని తెలిపారు. మామిడి, చీని, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో మొక్కల చుట్టూ వీడ్ మ్యాట్‌ను పరచడం ద్వారా కలుపు నియంత్రణతో పాటు నేలలో తేమను సంరక్షించవచ్చన్నారు. నీటి ఆవిరీభవనాన్ని తగ్గించడం ద్వారా నీటి వినియోగాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కూలీలపై అయ్యే వ్యయాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఫార్మ్ పాండ్‌కు రూ.90 వేల రాయితీ

20×20×3 మీటర్ల ఫార్మ్ పాండ్‌కు యూనిట్ ఖర్చు రూ.1.80 లక్షలు కాగా, ప్రభుత్వం రూ.90 వేల రాయితీ అందిస్తుందని లావణ్య తెలిపారు.

వీడ్ మ్యాట్‌కు రాయితీ వివరాలు

వీడ్ మ్యాట్ యూనిట్ ధర చదరపు మీటరుకు రూ.25 కాగా, ప్రభుత్వం రూ.12.50 రాయితీ అందిస్తుందని తెలిపారు. గరిష్ఠంగా 4,000 చదరపు మీటర్ల వరకు అర్హత ఉంటుందని, 100, 110 GSM స్పెసిఫికేషన్ కలిగిన వీడ్ మ్యాట్‌ను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఫార్మ్ పాండ్స్‌లో నిల్వ చేసిన నీటిని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలకు అందిస్తూ, వీడ్ మ్యాట్‌తో నేల తేమను కాపాడటం ద్వారా నీటి పొదుపు, సాగు వ్యయ తగ్గింపు, పంటల దిగుబడి, నాణ్యత మెరుగుదల సాధ్యమవుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగును మరింత లాభదాయకంగా మార్చుకోవాలని మండల ఉద్యానశాఖ అధికారి కుమారి లావణ్య సూచించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai