Gummagatta: ఒకే కుటుంబంలో తీరని విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకు బలి!
Gummagatta: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కర్రిసూరయ్యదొడ్డిలో విషాదం.
Gummagatta: ఒకే కుటుంబంలో తీరని విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కొడుకు బలి!
గుమ్మగట్ట: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కర్రిసూరయ్యదొడ్డి గ్రామ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంచాయతీ తాగు నీరు మోటారును బోరుబావిలోకి దింపుతున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకులు మృతిచెందారు. మృతులు రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన వారు ఆనంద్ (45), ఆయన కుమారుడు తేజ (22 ).
వాయిస్ ఓవర్ కరసూరాయ్య దొడ్డి పంచాయతీ తాగునీటి అవసరాల కోసం మోటారును బోరుబావిలోకి దింపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవాహానికి గురయ్యారు. స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ఒకేసారి మృతిచెందడంతో బొమ్మక్కపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




