Anantapur: హెచ్‌ఈసీలో 926 మార్కులతో మెరిసిన వి. చిత్తమ్మ!
Anantapur: ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్తమ్మ ఇంటర్ హెచ్‌ఈసీలో 926 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచి, మంత్రి చేతుల మీదుగా రూ. 20 వేల షైనింగ్ స్టార్స్ అవార్డు అందుకుంది.
Anantapur: హెచ్‌ఈసీలో 926 మార్కులతో మెరిసిన వి. చిత్తమ్మ!
అనంతపూర్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో (డి హిరేహాల్) మార్చ్ 2026 జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో జిల్లాస్థాయి ఉత్తమ ఫలితాలు సాధించి మరియు జిల్లా టాపర్గా నిలిచినటువంటి వి. చిత్తమ్మ హెచ్ఈసి గ్రూపు నందు వెయ్యి మార్కులకు గాను 926 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచినటువంటి ఆమెకు ప్రభుత్వం పథకాల్లో భాగంగా సైనింగ్ స్టార్ లో భాగంగా 20000 ప్రైజ్ మనీ మరియు ప్రతిభ పురస్కార సర్టిఫికెట్ మరియు గోల్డ్ మెడల్ మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు మరియు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారూ మరియు అనంతపురం స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ అలానే జిల్లా వృత్తి విద్యాధికారి గురవైశెట్టి మరియు రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వెంకటరమణ నాయక్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకు ప్రోత్సహించి మంచి విద్యను అభ్యసించడానికి పై చదువులకు ఉపయోగపడుతుందని ఇలాంటి కార్యక్రమాలను మన యువ నాయకుడు మానవ వనరుల శాఖ మాత్యులు లోకేష్ గారి ఆశ ఆకాంక్షతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు, అమ్మాయి యొక్క ఆశ కలెక్టర్ కావాలని భవిష్యత్తులో నేను కలెక్టర్ అయ్యి సమాజసేవకు ఉపయోగపడతానని తెలియజేసింది,ఈ అమ్మాయిని కళాశాల ప్రధాన చార్యులు కే వీరేష్ మరియు అధ్యాపకులు అభినందించడం జరిగింది.




