Sri Sathya Sai: ఇన్నోవాలో ఎర్రచందనం అక్రమ రవాణా భగ్నం: ఒకరు అరెస్ట్!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
Sri Sathya Sai: ఇన్నోవాలో ఎర్రచందనం అక్రమ రవాణా భగ్నం: ఒకరు అరెస్ట్!
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీశాఖ అధికారులు భగ్నం చేశారు.కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పెద్దన్నవారిపల్లి సమీపంలోని కోలేకనుమ వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా.. ఒకరిని అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.పట్టుబడిన నిందితుడు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం లింగాలదిన్నెకు చెందిన బంగారురెడ్డిగా గుర్తించారు. నిందితుడికి రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కదిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప హెచ్చరించారు. అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.




