Guntakal: గుంతకల్లులో జంగిల్ రాజ్.. రిజర్వాయర్‌లో శవంపై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

Guntakal: గుంతకల్లులో శాంతిభద్రతలు క్షీణించాయని, జంగిల్ రాజ్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి విమర్శలు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 15 May 2026 3:44 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో జంగిల్ రాజ్.. రిజర్వాయర్‌లో శవంపై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

గుంతకల్లు టౌన్: గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసన సభ్యులు శ్రీ వై. వెంకటరామిరెడ్డి గారు తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంతకల్లు నియోజకవర్గంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతకల్లు నియోజకవర్గంలో పాలన పూర్తిగా నిర్వీర్యమైందని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన అన్నారు. నేరాలు,అక్రమాలు పెరిగిపోవడంతో నియోజకవర్గం జంగిల్ రాజ్‌ను తలపిస్తోందని విమర్శించారు.

ఇటీవల గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని రిజర్వాయర్‌లో ఒక మృతదేహం లభించడం అత్యంత ఆందోళనకర విషయమని పేర్కొన్నారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని, ప్రజల ప్రాణాలు,రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మున్సిపల్ పాలన పూర్తిగా క్షీణించిందని, ప్రజలకు కనీస భద్రత మరియు మౌలిక సదుపాయాలు అందించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story