Anantapur: పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి రూ.5 లక్షల ఫ్రీజర్ బాక్స్!

Anantapur: అనంతపురం జిల్లా పామిడి ఆసుపత్రిలో ఫ్రీజర్ బాక్స్ కొరత తీరుస్తూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ రూ.5 లక్షల విలువైన బాక్స్‌ను సమకూర్చారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 8 Oct 2026 3:55 PM IST
Anantapur
X

Anantapur: పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి రూ.5 లక్షల ఫ్రీజర్ బాక్స్!

Anantapur: పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ బాక్స్ కొరత ఉందని ఆసుపత్రి వర్గాలు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జయరామ్ రూ.5 లక్షల విలువైన ఫ్రీజర్ బాక్స్‌ను ఆసుపత్రికి సమకూర్చారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రీజర్ బాక్స్‌ను గురువారం పామిడి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రీజర్ బాక్స్‌ను సమకూర్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ కార్తీక్ రెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చిలకల రాజగోపాల్, కత్రిమల ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, జింకల సంజీవ, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌస్ పీరా, కాలువ చైర్మన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL