Kadiri: ప్రేమ పేరుతో మోసం.. పురుగుల మందు తాగిన యువతి!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట మోసపోయానని ఆవేదన వ్యక్ూ చేస్తూ సరస్వతి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

P.RAHAMTULLA, KADIRI
Published on: 28 July 2026 5:52 PM IST
Kadiri
X

Kadiri: ప్రేమ పేరుతో మోసం.. పురుగుల మందు తాగిన యువతి!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి RDO కార్యాలయం ముందు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ సరస్వతి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలానికి చెందిన సరస్వతి అనే యువతి, సత్యసాయి జిల్లా తలుపుల మండలం సిద్ధుగురువారిపల్లికి చెందిన శంకర్ అనే యువకుడితో గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉండి కలిసి జీవించామని తెలిపింది.

అయితే, తనకు తెలియకుండా ఆ యువకుడు మరో వివాహం చేసుకున్నాడని యువతి ఆరోపించింది. ఈ విషయమై అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వలేదని, తాను మోసపోయానని యువతి గ్రహించింది.

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా, డీఎస్పీ సీఐకి రిఫర్ చేశారని, అనంతరం తలుపుల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించారని ఆమె తెలిపింది. అయితే అక్కడ కూడా తన ఫిర్యాదుపై తగిన స్పందన లభించలేదని, అసభ్యంగా ప్రవర్తించారని యువతి ఆరోపించింది.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సరస్వతి, నేడు కదిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆమెను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, బాధితురాలికి న్యాయం జరుగుతుందో లేదో వేచిచూడాలి.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story