Anantapur: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి గుత్తి సిఐ M. రామారావు!
Anantapur: గుత్తి మండలం తొండపాడులో సిఐ M. రామారావు అవగాహన సదస్సు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, 1930 హెల్ప్‌లైన్ మరియు దిశ యాప్‌పై ప్రజలకు ప్రత్యేక సూచనలు.
Anantapur: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి గుత్తి సిఐ M. రామారావు!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ప్రజలకు చట్టాలపై అవగాహన, సైబర్ నేరాలు, మహిళా భద్రత వంటి అంశాలపై *గుత్తి సిఐ M. రామారావు , సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ రామారావు గారు మాట్లాడుతూ నేటి సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, OTP, లింక్ లు, లోన్ యాప్ ల పేరిట జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, OTP లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని తెలిపారు. సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కు ఫిర్యాదు చేయాలని, లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు.
మహిళలు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న దిశ యాప్, 100, 112, దిశ హెల్ప్ లైన్ లను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈవ్ టీజింగ్, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాలు, గంజాయి, డ్రగ్స్, మద్యం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. చట్టాలను గౌరవించి, శాంతి భద్రతలకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుత్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




